దర్శకుడు పూరీ జగన్నాథ్ తనకు సూపర్ హిట్ అందించిన గోలీమార్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఎలాగైన మళ్లీ హిట్టు కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటికి వచ్చింది. పూరీ జగన్నాథ్ – గోపీచంద్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గోలీమార్. ప్రియమణి కథానాయికగా నటించగా.. బెల్లంకొండ సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా గోపీచంద్ కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా మిగిలింది. పోలీస్ – మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో గంగారాం అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు గోపీచంద్. అయితే ఈ సినిమా వచ్చి 15 ఏళ్ళవుతున్న తర్వాత ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సీక్వెల్‌ను కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- February 20, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor