బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డాకు మహారాజ్” తో సాలిడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా “అఖండ 2″లో తాను ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ సినిమాపై ఇప్పుడొక సాలిడ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. తాను విలన్ రోల్ లోనే కనిపిస్తారని కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమౌతోంది.

- February 20, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor