మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో హిందీ చలన చిత్రసీమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ వలన ఈ సినిమాకి సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ రాగా, నార్త్‌లో హృతిక్‌రోషన్ వలన వచ్చింది. దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలామంది పోటీపడ్డారు. అయితే అందరి కంటే నాగవంశీ ఒక అడుగు ముందుకు వేసి రైట్స్ దక్కించుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సంబంధించిన ఎస్.నాగవంశీ ఈ సినిమా తెలుగు హక్కులను రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇది ఈ మధ్యకాలంలో ఒక హిందీ సినిమా తెలుగు రైట్స్‌కు దక్కిన అత్యధిక ధరగానే చెప్పాలి. సౌత్ మార్కెట్‌పై బాలీవుడ్ నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఇది మరోసారి రుజువు చేస్తోంది. బాలీవుడ్‌లో యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ ఫ్రాంచైజీలో క్రేజీ ప్రాజెక్ట్‌గా ‘వార్-2’ రూపొందుతోంది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ స్పై క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
- July 2, 2025
0
122
Less than a minute
Tags:
You can share this post!
editor

