థియేటర్ల బంద్‌పై.. ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన నిర్మాతలు

థియేటర్ల బంద్‌పై.. ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన నిర్మాతలు

జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌పై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా చర్చలు జరిగాయి. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై సందిగ్ధత కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉదయం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, సాయంత్రం నిర్మాతలు సమావేశంపై సమాలోచనలు చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన‌ సురేష్‌బాబు, దిల్‌రాజు, మైత్రీ రవి, సితార నాగవంశీ, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు సహా పలువురు నిర్మాతలంతా ఎగ్జిబిటర్ల డిమాండ్లపై చర్చించారు. ముఖ్యంగా పర్సంటేజ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ విధానానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పాత పద్ధతిలోనే మొదటి వారం అద్దె విధానం, రెండో వారం పర్సంటేజ్ ప్రకారమే చెల్లిస్తామని వాదించారని సమాచారం. ఈ సమావేశంలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ పరిష్కారానికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చర్చల అనంతరం జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

editor

Related Articles