బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. డర్టీ పిక్చర్ సినిమాతో ఇండియా వైడ్‌గా సూపర్ స్టార్‌గా నిలిచింది విద్యాబాలన్. అందరి హీరోయిన్ల లాగానే తాను కూడా కెరీర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ బాధలు అనుభవించానని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్లో నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేకపోయాను. ఆ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్లో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వచ్చిన భూల్ భూలయ్య 3 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది విద్యాబాలన్.
- April 22, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor

