బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సినిమా వార్ 2 గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గరే ఇదొక క్రేజీ బిగ్గెస్ట్ మల్టీస్టారర్. దీంతో నార్త్ నుండి సౌత్ వరకు భారీ హైప్‌ని సెట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల విషయంలో మంచి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ తీసుకున్నట్టుగా వచ్చిన రూమర్స్ ఇప్పుడు నిజం అయ్యాయి. నాగవంశీ ఆ బిగ్ అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ క్రేజీ వీడియోతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాం అని రివీల్ చేశారు. అరవింద సమేత, దేవర తర్వాత ఇప్పుడు తన తారక్ అన్న కోసం మరోసారి వార్ 2 తో తెలుగు స్టేట్స్‌లో సంబరాలు జరుపుకుందాం అంటూ నాగవంశీ తన ప్రేమను వ్యక్తం చేశారు. మొత్తానికి ఆగస్ట్ 14న ఈ సినిమా రిలీజ్ ఉండనుంది అని చెప్పవచ్చు.

- July 5, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor