హీరో శ్రీకాంత్‌కు ప్రైవేటు పూజలు.. శ్రీకాళహస్తి వేద పండితుడిపై సస్పెన్షన్‌ వేటు

హీరో శ్రీకాంత్‌కు ప్రైవేటు పూజలు.. శ్రీకాళహస్తి వేద పండితుడిపై సస్పెన్షన్‌ వేటు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేద పండితుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్‌ కుటుంబానికి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 29న శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ పూజలను ముక్కంటి ఆలయంలో పనిచేస్తున్న కొందరు అర్చకులు, వేద పండితులు నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయ ఆచార వ్యవహారాలకు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించడంపై ఆలయ అధికారులు సీరియస్‌గా స్పందించి, సంబంధిత వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

editor

Related Articles