‘ఖలీఫా’ గ్లింప్స్ రిలీజ్..

‘ఖలీఫా’ గ్లింప్స్ రిలీజ్..

మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న‌ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందింది. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘ఖలీఫా’ సినిమా నుండి మేక‌ర్స్ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ‘ది బ్లడ్‌లైన్’ అనే క్యాప్ష‌న్‌తో వ‌చ్చిన ఈ గ్లింప్స్‌లో పృథ్వీరాజ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోంది. వైశాఖ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. జిను వి. అబ్రహాం, సూర‌జ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఓనం సంద‌ర్భంగా 2026లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

editor

Related Articles