ప్రియదర్శి హీరోగా, ఆనంది హీరోయిన్గా నటించిన లేటెస్ట్ రోమ్ కామ్ డ్రామానే “ప్రేమంటే”. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ సాగిందిలా: మధుసూదనరావు (ప్రియదర్శి) అలాగే రమ్య (ఆనంది) ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఓ మూడు నెలలు ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ తర్వాత మధు విషయంలో రమ్యకి ఒక షాకింగ్ నిజం తెలియడంతో ఆమె అతణ్ణి వదిలెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది. కానీ మధు మాత్రం ఒక్క చివరి అవకాశం కోరుతాడు. అలాగే మరో ఘటన తర్వాత ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అతణ్ణి మరింత షాక్‌కి గురి చేస్తుంది. మరి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు మధుసూదన్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆమె ఏం తెలుసుకుంది. ఈ ఇద్దరి మధ్యలో హెడ్ కానిస్టేబుల్ ఆశామేరీ (సుమ) ఎంటర్ అయ్యాక ఏం జరిగింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే.
- November 21, 2025
0
33
Less than a minute
You can share this post!
editor

