హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… ‘మ్యూజిక్ చేసిన నాకే కొత్తగా ఉంది. నేనే మ్యూజిక్ చేశానా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో కొత్తగా ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది.
- November 20, 2025
0
221
Less than a minute
You can share this post!
administrator

