పాక్ హీరోకి స‌పోర్ట్‌గా నిలిచిన ప్ర‌కాష్‌రాజ్..

పాక్ హీరోకి స‌పోర్ట్‌గా నిలిచిన  ప్ర‌కాష్‌రాజ్..

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రణాళిక‌లు రచిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా గ‌ట్టి డిమాండ్ వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత్‌పై దాడికి పాల్పడినవారికి తగిన రీతిలో బదులివ్వడానికి సైన్యంతో కలిసి పనిచేయడం తన బాధ్యత అంటూ రీసెంట్‌గా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీంతో త్వ‌ర‌లోనే పాక్‌కి భార‌త్ గ‌ట్టి గుణ‌పాఠం చెప్ప‌నుంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడే ప్ర‌కాష్‌రాజ్ కొన్నిసార్లు వివాదాస్ప‌ద కామెంట్స్ చేస్తూ విమ‌ర్శ‌ల బారిన ప‌డుతుంటాడు. ఈ క్రమంలోనే ఈ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది. పాకిస్తానీయుల‌ని కూడా ఈ దేశం నుండి పంపేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్ర‌కాష్‌రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్ర‌కాష్‌రాజ్ తప్పు పట్టారు.

editor

Related Articles