పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ సినిమా “ది రాజా సాబ్” నుండి రీసెంట్ గానే వచ్చిన టీజర్ మంచి అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరిన్ని సినిమాలు చేస్తుండగా వీటిలో దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమా కోసమో లేక వేరే సినిమా కోసమో కానీ ప్రభాస్ సిద్ధంగా ఉన్న కొత్త లుక్‌లో స్టైల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బాహుబలికి ముందు ప్రభాస్ లుక్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. మళ్ళీ ఆ లుక్‌లో అయితే ప్రభాస్ ఇప్పుటివరకు కనిపించలేదు. సాహోలో కొన్ని సీన్స్‌లో మాత్రం అలా ఉంటాడు. మరి మళ్ళీ ఫైనల్‌గా ఇప్పుడు ఆ లుక్‌లో తాను కనిపించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- July 2, 2025
0
78
Less than a minute
Tags:
You can share this post!
editor

