ప్ర‌భాస్ చెల్లెళ్లు చాలా ట్రెడిష‌న‌ల్‌ డ్రెస్సుల్లో కనబడుతున్నారే..

ప్ర‌భాస్ చెల్లెళ్లు చాలా ట్రెడిష‌న‌ల్‌ డ్రెస్సుల్లో కనబడుతున్నారే..

ప్రభాస్ సినిమాల సంగతి పక్కనపెడితే, ఆయనకు నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరు దివంగత నటుడు కృష్ణంరాజు కుమార్తెలు. వీరిలో ప్రసీద ఇప్పటికే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రసీద తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘2025 – హాఫ్ వే దేర్’ అంటూ, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జరిగిన మధురమైన సంఘటనల్ని గుర్తుచేస్తూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తల్లి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ప్రసీదపై, ఆమె పోస్ట్‌లపై ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.

editor

Related Articles