ద‌ర్శ‌కుడిని మందలించిన ప్ర‌భాస్.. కార‌ణం ఏమిటో..!

ద‌ర్శ‌కుడిని మందలించిన ప్ర‌భాస్.. కార‌ణం ఏమిటో..!

టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. పెళ్లిని కూడా పక్క‌న పెట్టి ఒప్పుకున్న సినిమాలని పూర్తిచేసే ప‌నిలో ఉన్నాడు. ప్ర‌భాస్ న‌టించిన ది రాజా సాబ్ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు ప్ర‌భాస్ ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఫౌజీ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్‌ మీడియా ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడికి ప్ర‌భాస్‌ కూల్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. ఈ మ‌ధ్య హ‌ను రాఘవపూడి సెట్‌లో కాస్త హడావిడిగా ఉండటం, అప్పుడప్పుడూ టెక్నీషియన్స్‌పై కోప్పడటం, అరవటం వంటివి చేస్తూ సెట్‌లో చాలా టెన్షన్‌గా ఉంటున్నారట. అయితే ఇదంతా మంచి ఔట్‌పుట్ కోస‌మే అయినా కూడా త‌న సినిమా సెట్‌లో అలా ఉండ‌కూడ‌ద‌ని భావించిన ప్రభాస్.. హను రాఘవపూడిని పిలిచి కూర్చోపెట్టి, హడావిడి పడద్దని, కూల్‌గా ఉంటేనే మంచి ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని స్వీట్ వార్నింగ్ ఇచ్చార‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

editor

Related Articles