హీరో ప్రభాస్ అభిమానులు, మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం రాజాసాబ్. హర్రర్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ సినిమా మారుతి డైరెక్షన్లో వస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ పోస్టర్ విడుదల చేశారన్న విషయం మీకు తెలిసిందే. వివాదరహితుడైన పాలనాదక్షుడు 2025 ఏప్రిల్ 10న వస్తున్నాడు.. అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్లో రాజసం ఉట్టి పడే రాయల్ లుక్‌లో కొంచెం చమత్కారంగా, కొంచెం భయానకంగా కనిపిస్తున్న రాజాసాబ్ స్టిల్ నెట్టింట హడావుడి చేస్తోంది. రాజాసాబ్ మోషన్ పోస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లో 8.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రభాస్ మేనియా ఎలా ఉందో ఈ ఒక్క అప్డేట్తో అర్థమవుతోంది.
- October 24, 2024
0
129
Less than a minute
Tags:
You can share this post!
administrator


