ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన డార్లింగ్ ప్రభాస్ తాజాగా కన్నడ ఇండస్ట్రీ టాప్ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లకు సంతకం చేశాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ తాజాగా ప్రభాస్‌తో బంఫర్ ఆఫర్ కొట్టేసింది. ప్రభాస్‌తో ఒక్క సినిమా తీస్తేనే అదృష్టం అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లకు ఒప్పందం కుదుర్చుకుంది. అవును 2026 నుండి 2028 వరకు ప్రభాస్‌తో మూడు భారీ ప్రాజెక్ట్‌లు ఉండబోతున్నట్లు హోంబాలే ఫిలింస్ ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌లలో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏడాదికో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ముందుగా సలార్ 2 రాబోతోంది అంటూ హోంబాలే వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే.. ప్రభాస్ మరో నాలుగు ఏళ్లు ఫుల్ బిజీ అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతితో రాజాసాబ్ చేస్తున్న ప్రభాస్ దీని అనంతరం హను రాఘవపూడితో ఫౌజీ చేస్తున్నాడు. ఇవే కాకుండా లైన్‌లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ప్రశాంత్ వర్మ సినిమాలు ఉన్నాయి.

- November 8, 2024
0
29
Less than a minute
Tags:
You can share this post!
administrator