రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, భావోద్వేగ కథలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం **‘ఫౌజీ’**పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో, టి-సిరీస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది. ప్రభాస్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్న ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.
ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ, విషాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానున్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


