ప్రభాస్, మహేష్ బాబు కాంబోలో మల్టీ స్టారర్?

ప్రభాస్, మహేష్ బాబు కాంబోలో మల్టీ స్టారర్?

హీరో ప్రభాస్ షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్ర‌భాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమా కూడా షూటింగ్ ప్రారంభం కానుంది. వీటి త‌ర్వాత క‌ల్కి సీక్వెల్‌, స‌లార్ సీక్వెల్ సినిమాలు చేయ‌నున్నాడు. డార్లింగ్ సినిమాల నుండి ప‌లు అప్‌డేట్స్ రాగా, అవి ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించాయి. ఈ క్రమంలో, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్ర‌భాస్ సినిమా ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. దివంగత నటుడు కృష్ణంరాజు.. మహేష్ – ప్రభాస్ కాంబోలో ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమాను చేయాలనుకున్నారట‌. ఆ సమయంలో డైరెక్టర్ మురగదాస్ వీరిద్దరి కోసం ప్రత్యేక స్టోరీ కూడా రెడీ చేసినట్లు టాక్. అయితే, ఇద్దరు హీరోలు ఇప్పటికే ఇతర ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండడంతో, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్ ఇప్పుడు చేస్తే పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ కావ‌డం ఖాయం అంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్ర‌భాస్ – మ‌హేష్ బాబుని ఒకే తెర‌పై చూస్తే ఆ కిక్కే వేర‌ప్పా అని అంటున్నారు.

editor

Related Articles