ఓ పాత సినిమా జనం ముందుకు మళ్ళీ వస్తే దానిని ‘రీ-రిలీజ్’ అనే అంటారు. కానీ, రాజమౌళి తన ‘బాహుబలి’ సిరీస్‌ను ఒకటిగా చేసి ‘బాహుబలి – ది ఎపిక్’గా రూపొందించారు. దీనిని మాత్రం ‘రీ-రిలీజ్’ అనకూడదని రాజమౌళి అంటున్నారు. ఎందుకలాగా? జానపద కథలకు కాలం చెల్లింది అన్న సెంటిమెంట్‌ను తుడిచేస్తూ తెలుగునాట ‘బాహుబలి’ సిరీస్‌తో ఘనవిజయం సాధించారు రాజమౌళి. 2015 జూలై 10వ తేదీన ‘బాహుబలి – ద బిగినింగ్’ విడుదల కాగా, 2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి – ద కంక్లూజన్’ జనం ముందు నిలచింది. మొదటి భాగం 650 కోట్లకు పైగా వసూళ్ళు చేస్తే, రెండో భాగం మన దేశంలోనే తొలిసారి వెయ్యి కోట్లు కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలచింది. అంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సిరీస్‌ను ఇప్పుడు ఒకటే పార్ట్‌గా చేసి ‘బాహుబలి- ది ఎపిక్’ ను రూపొందించారు. ఈ సినిమాని అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

- August 28, 2025
0
92
Less than a minute
You can share this post!
editor