పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ కన్నా సూపరా?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ కన్నా సూపరా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనే సందేహం అంద‌రిలో ఉంది. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పవన్ కళ్యాణ్ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సంస్థలో ఆయన ఒక సినిమాలో నటించేందుకు ఒప్పందం పూర్తి అయ్యిందని తెలిసింది.

editor

Related Articles