టాలీవుడ్ హీరో సాయి దుర్గాతేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. హీరో సాయి దుర్గా తేజ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్‌ది. చిత్రపరిశ్రమలోకి వచ్చిన మొదటిరోజు నుండే ప్రతిరోజు ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు. వర్తమాన విషయాలపై స్పందిస్తూ.. రహదారి భద్రత, సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై చైతన్యపరుస్తున్నాడు. సాయితేజ్ హీరోగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ దీవించారు.

- October 15, 2025
0
44
Less than a minute
You can share this post!
editor