కన్నడ సినీ ఫీల్డ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు బ్యాంక్ జనార్దన్ ఇకలేరు. ఆయన నేడు మృతి చెందారు. ఆయన వయసు 77 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మొదట అనారోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా.. చివరకు చికిత్స సమయంలోనే ఆయన ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. బ్యాంక్ జనార్దన్ 500 కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఖననం, రిదం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 తదితర సినిమాలు చేశారు. 1948లో జన్మించిన ఈయన తొలుత బ్యాంకులో పనిచేసి, నాటక, చిత్ర రంగాల్లోకి ప్రవేశించారు. బ్యాంక్ జనార్దన్ మృతి పట్ల కన్నడ పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ జనార్దన్ గొప్ప హాస్య నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని కన్నడ సినీ అభిమానులు వేడుకుంటున్నారు. మా మూవీ మజ్ తరఫున బ్యాంక్ జనార్దన్ గారికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోకాతప్త హృదయులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

- April 14, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor