అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో బుట్టబొమ్మ ప్రవేశం..

అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో బుట్టబొమ్మ ప్రవేశం..

బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే ఐటెం సాంగ్స్‌ ద్వారా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మొన్నటికి మొన్న ర‌జ‌నీకాంత్ హీరోగా తెరకెక్కిన “కూలీ” సినిమాలో “మోనికా లవ్ యూ మోనికా” పాటతో ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే, ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్‌ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూజా “రంగస్థలం”లో “జిగేల్ రాణి”గా కూడా మెరిసింది. ఆ తర్వాత “F3”లో కూడా స్పెషల్ సాంగ్‌లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హీరోయిన్‌గా లీడ్ రోల్స్ చేస్తూనే మ‌రోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ రెండు వైపులా క్రేజ్, సంపాదన పెంచుకుంటోందని టాక్. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్, కోలీవుడ్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతోందట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన చర్చ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

editor

Related Articles