విలేకరులు అడిగిన ప్రశ్నలతో పూజా హెగ్డేకు చిర్రెత్తిన కోపం..?

విలేకరులు అడిగిన ప్రశ్నలతో పూజా హెగ్డేకు చిర్రెత్తిన కోపం..?

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే కోపంతో రగిలిపోయింది. షాహిద్‌ కపూర్‌తో ‘దేవా’  సినిమాలో యాక్ట్ చేసింది. ఇటీవలే ఆ సినిమా విడుదలైంది కూడా. ఈ సినిమా ప్రమోషన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పూజాకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘సల్మాన్‌, హృతిక్‌, రణ్‌వీర్‌, షాహిద్‌ వంటి హీరోల సినిమాల్లో నటించడాన్ని మీరు అదృష్టంగా భావిస్తారా? అసలు అందుకు మీరు అర్హులేనా? అని విలేకరులు పూజాను ప్రశ్నించగా.. ‘ఎస్‌.. అర్హురాలినే. ఒకవేళ అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయని మీరు అనుకుంటే.. అనుకోండి.. నేను ఏమాత్రం బాధ పడను. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి తప్ప, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో బుర్రను పాడుచేసుకోను. అదే నాకు అదృష్టంగా భావిస్తా.’ అని సమాధానమిచ్చింది పూజా. ఏదేమైనా ఓ హీరోయిన్‌ను అలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం సబబు కాదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

editor

Related Articles