ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమాని ఆడియెన్స్ చూడకపోవడం దర్శకుడికి తీవ్ర నిరాశను మిగిల్చింది. శుక్రవారం విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాకి క్రిటిక్స్ ప్రశంసలు లభించినా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స ఈ పరిస్థితిని చూసి సహనం కోల్పోయి ఏడుపు మొహం పెట్టుకున్నాడు. మీడియా ముందుకు వచ్చి తన బాధను షేర్ చేశాడు. థియేటర్‌కి వెళ్లాను. కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. వాళ్లకు నేను దర్శకుడినని తెలియదు. కానీ సినిమా బాగుందని హగ్ చేసుకున్నారు. సినిమా నచ్చితే ఈ స్థాయిలో స్పందిస్తే, మరి మిగతా వారు ఎందుకు చూడడం లేదో నాకు అర్థం కావడం లేదు అని భావోద్వేగంతో అన్నాడు మోహన్. తాను ఈ సినిమాకు రెండున్నరేళ్లు రోజూ కష్టపడినట్లు చెప్పిన మోహన్ శ్రీవత్స, తన భార్య కూడా సినిమా చూసి మధ్యలో ఇంటికి వచ్చేసిందని చెప్పాడు. ఆమె భావోద్వేగంగా సినిమా ఉందని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రేక్షకులే రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

- September 1, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor