పుష్ప-2 టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు ప్లాన్‌..!

పుష్ప-2 టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు ప్లాన్‌..!

హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందించిన పుష్ప-2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన లభించింది. ఇక పుష్ప ద రైజ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు పాన్‌ ఇండియా స్టార్‌ హోదా అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ అవార్డుని అందుకున్నాడు.  ఈ క్రమంలో పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

టీజర్‌ విడుదలైన ఒక రోజులేనే 100 మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయంటే సినిమాకి ఎంత క్రేజ్‌ ఉందో తెలుస్తోంది. డిసెంబర్‌ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో విడుదల కానున్నది. రికార్డు స్థాయిలో థియేటర్స్‌లో మూవీ విడుదల కానుండగా.. టికెట్‌ ధరలను భారీగా పెంచనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్లను భారీగా పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన కల్కి, దేవర మూవీలకు టికెట్ల ధరలను పెంచుకోవడంతో పాటు అదనపు షోలను వేసుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలోనే పుష్ప-2 టికెట్ల ధరలను సైతం పెద్ద ఎత్తున పెంచనున్నట్లు తెలుస్తోంది.

administrator

Related Articles