బాలీవుడ్ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ నటించిన ‘ఫూలే’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఏప్రిల్ 11, 2025న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఏప్రిల్ చివరి వరకు వాయిదా వేశారు. ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890) అతడి భార్య సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా బాలీవుడ్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఫూలే అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. అతడి భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తోంది. అనంత్ నారాయణ్ మహాదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

- April 10, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor