ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక కలుసుకుంది. టామ్ క్రూజ్ నటించిన తాజా చిత్రం “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకానింగ్” వరల్డ్ ప్రీమియర్ షో లండన్‌లో ఇటీవల ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిహారిక, టామ్ క్రూజ్‌తో కలిసి ముచ్చటించడంతో పాటు అతడితో కలిసి ఫొటోలు దిగింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని నిహారిక తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేశారు. టామ్ క్రూజ్‌తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఆమె భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ మిషన్ సాధ్యమవ్వడంతో నా ఆత్మ పరవశించిపోయింది. కాగా, “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకానింగ్” సినిమా నేడు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిషన్: ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న చివరి చిత్రమిది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 8 చిత్రాలు వచ్చాయి.
- May 17, 2025
0
53
Less than a minute
Tags:
You can share this post!
editor

