హీరో రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతం శ్రీలంకలో కీలకమైన షెడ్యూల్‌లో బిజీగా ఉంది. అక్కడ రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటపై ఓ అందమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఇది విజువల్‌గా, మ్యూజికల్‌గా గ్రాండ్ ట్రీట్‌గా మారబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. రామ్ చరణ్ కూడా ఇటీవల శ్రీలంక బయలుదేరుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
ఇంతలో, శ్రీలంక లొకేషన్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోల్లో ఇద్దరూ ఒక పాత రైల్వే ట్రాక్ టన్నెల్ ముందు నిలబడి ఉన్నారు. ఈ లొకేషన్ చూసి ఫ్యాన్స్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

