హీరో రామ్ చరణ్‌తో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంకలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో జాన్వీ క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
- November 1, 2025
0
44
Less than a minute
You can share this post!
editor

