హీరో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్‌ను కూడా క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ ఫినిష్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పెద్ది నుండి మొదటి సాంగ్ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా పెద్ది టీమ్ శ్రీలంకకు బయలుదేరింది. అక్కడ ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. చరణ్, జాన్వీల మీద రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం.
- October 25, 2025
0
129
Less than a minute
You can share this post!
editor


