పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ప్రస్తుతం రిలీజ్‌కి దగ్గర పడుతున్న సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. భారీ హిస్టారికల్ డ్రామాగా దర్శకులు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన ఈ సినిమా తాలూకా ట్రైలర్ పరంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రేపు గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల అవుతున్న ఈ ట్రైలర్ పట్ల పవన్ చాలా హ్యాపీగా ఉన్నారని తెలిసింది. ఇదివరకు చూసిన ట్రైలర్‌లో కొన్ని మార్పులు సూచించగా వాటిని అప్‌డేట్ చేసి లేటెస్ట్‌గా వేసిన స్క్రీనింగ్‌తో సూపర్ హ్యాపీగా ఉన్నారని తెలిసింది. అయితే ఫైనల్‌గా ఈ ట్రైలర్‌పై పవన్‌తో సహా చిత్ర యూనిట్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లపై విజువల్స్ బయటకి వచ్చాయి. థియేటర్‌లో ట్రైలర్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్న పవన్ విజువల్స్ తన రియాక్షన్ ఫ్యాన్స్‌ని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. మొత్తానికి మాత్రం మేకర్స్ మంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఇక రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
- July 2, 2025
0
83
Less than a minute
Tags:
You can share this post!
editor

