పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు హీరో గానే కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పహల్గం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన పట్ల పవన్ చాలా బాధపడ్డారు. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ కొన్ని లోకల్ నుండి నేషనల్ వైడ్‌గా కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇలా చేసిన కామెంట్స్‌లో ప్రస్తుతం నెలకొన్న విషాద పరిస్థితులలో ఎవరైనా సంఘవిద్రోహులు కానీ సోషల్ మీడియాలో దేశం పట్ల తప్పుగా మాట్లాడినా పోస్ట్‌లు పెట్టినా సరే వారికి జైలే గతి అని గట్టి వార్నింగ్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇక కొన్ని రోజుల్లో పవన్ తన సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం జరుగుతుంది. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడం కూడా జరుగుతుందని ఒక సమాచారం.
- April 25, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor

