బాల‌కృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

బాల‌కృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు త‌న 65వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా బాల‌య్య‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. శతాధిక సినిమాల హీరో, హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన హీరో ఆయన. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాసుకొచ్చాడు.

editor

Related Articles