పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ముద్దుల తనయుడు మార్క్ శంకర్‌ని సింగపూర్ నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్న మార్క్ శంకర్ ఇప్పుడు స్కూల్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పటాన్ చెరులోని ఇక్రిశాట్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. కుమారుడి అడ్మిషన్ కోసం ఇక్రిసాట్‌కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి టీచర్లతో మాట్లాడారు. అదే విధంగా ఇంటర్నేషన్ స్కూల్‌లో సిలబస్, విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు మొదలైన విషయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇక ఇదే పాఠశాలలో మహేష్‌బాబు పిల్లలు చదివారు. అల్లు అర్జున్ పిల్లలు కూడా ఈ స్కూల్‌లోనే చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాని కూడా లోపలికి రానివ్వలేదు.
- June 14, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor

