Movie Muzz

లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్…: కార్తీ సారీ..

లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్…: కార్తీ సారీ..

లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల సంభాషణ చిలికి చిలికి గాలివానైంది. కార్తీ- పవన్‌కు క్షమాపణలు కూడా  చెప్పాడు. లడ్డూ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలను నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు. రెండు వారాల క్రితం, కార్తీ ఇదే విషయమై పవన్ కళ్యాణ్‌కి క్షమాపణలు కూడా చెప్పాడు. తన సినిమా సత్యం సుందరం (తమిళంలో మీయాళగన్) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లడ్డూ గురించి మాట్లాడమని కార్తీని రెచ్చగొట్టిన యాంకర్‌ను పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. తన సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ కార్తీ క్షమాపణలు చెప్పాడని కూడా చెప్పారు.

editor

Related Articles