టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రేణు దేశాయ్, అనంతరం పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. పవన్ మళ్లీ పెళ్లి చేసుకోగా రేణు మాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా తన పిల్లలు కోసం ఒంటరిగా మిగిలిపోయారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె తరచూ అభిమానుల ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన వ్యాఖ్యలు రేణు దేశాయ్ ని తీవ్రంగా కలిచివేసింది. మిమ్మల్ని మేము ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. దీనిపై రేణు ఘాటుగా స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ కామెంట్ చేసిన వ్యక్తి కొంత చదువుకున్నవాడే అనుకుంటున్నా. సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీషులో కామెంట్ రాసే స్థాయిలో ఉన్నాడు. కానీ మనం 2025లో ఉన్నప్పటికీ, నేటికీ స్త్రీలు భర్త లేదా తండ్రి ఆస్తి అనే మనస్తత్వం సమాజంలో బలంగా ఉంది. ఇది పితృస్వామ్యం వల్లే అని రేణు పేర్కొన్నారు. ఇప్పటికీ మహిళలు చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా అనే నిర్ణయాలకు ‘పర్మిషన్’ అవసరం అవుతోంది. ఇంకా స్త్రీ అంటే వంటగదిలో వంట చేయడం, పిల్లలు కనడం కోసం మాత్రమే అని భావించే మగవాళ్లు ఉన్నారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా నేను గళం విప్పుతాను. నా స్నేహితులు, ఫాలోయర్స్ ఏమనుకుంటారో అని భయపడను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం అని ఆమె రాసుకొచ్చారు.

- September 13, 2025
0
30
Less than a minute
You can share this post!
editor