చాలా రోజులు తర్వాత తెలుగు సినిమా నుండి రిలీజ్‌కి రాబోతున్న భారీ చిత్రమే “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాని క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణలు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎట్టకేలకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మేకర్స్ సమయానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నారు. ఇలా ట్రైలర్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పాల్సి ఉండడం మరింత టెన్షన్‌గా మారింది. అయితే ఈ డబ్బింగ్‌ని పవన్ కళ్యాణ్ ఫైనల్‌గా ముగించేశారు. ఒక పక్క ఓజి షూటింగ్‌ని చేస్తూనే దానిని ముగించి రాత్రి 10 గంటలకి హరిహర వీరమల్లు డబ్బింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా 4 గంటల్లోనే పూర్తిచేసి తన డెడికేషన్ చూపించారు. ఇక తర్వాత ట్రైలర్ కోసం మనం ఎదురు చూడ్డమే.
- May 29, 2025
0
144
Less than a minute
Tags:
You can share this post!
editor

