ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తన సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పాత ఫొటోను షేర్ చేశారు చిరంజీవి. ఆ ఫొటోలో చిరు, పవన్ ఇద్దరూ యంగ్ లుక్‌లో కనిపిస్తుండగా, ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నీవు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండిన జీవితంతో నువ్వు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవా అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు చిరు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

- September 2, 2025
0
35
Less than a minute
You can share this post!
editor