ప్ర‌భాస్ సినిమాలో పాక్ హీరోయిన్‌.. ఇబ్బందుల్లో చిత్ర నిర్మాత‌లు

ప్ర‌భాస్ సినిమాలో పాక్ హీరోయిన్‌.. ఇబ్బందుల్లో చిత్ర నిర్మాత‌లు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ సమీపంలో నిన్న జరిగిన బైసరన్‌ అనే అందమైన ప్రదేశంలో ఉగ్రవాదులు జరిపిన దాడి ఎంత భ‌యానకం సృష్టించిందో మీకు తెలుసు. ట్రెక్కింగ్‌ని ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం కాగా, ఈ ప్రాంతంలో సడెన్‌గా (నక్కి ఉన్న ఉగ్రవాదులు) పర్యాటకులపై కాల్పులు జరపడంతో దాదాపు 28 మందికి పైగా చ‌నిపోయారు. కుల మతాలకు అతీతంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండించారు. అయితే… ఈ దాడి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమా వార్తల్లోకి వచ్చింది. అందుకు కార‌ణం సినిమా హీరోయిన్. ఫౌజీ సినిమాలో ప్ర‌భాస్‌కి జ‌త‌గా ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.. డాన్స్‌ల ద్వారా మంచి ఫేమ‌స్ అయిన ఇమాన్వి ఏకంగా హీరో ప్ర‌భాస్ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే టెర్ర‌ర్ అటాక్ త‌ర్వాత ఈమెపై కొంద‌రు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అందుకు కార‌ణం ఈవిడ విదేశాల నుండి ఇండియాకి వ‌చ్చిన‌ప్ప‌టికీ మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండ‌డ‌మే. పాక్ మాజీ మిలటరీ అధికారి కుమార్తె ఇమాన్వి కాగా, వీరి ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడింది. జన్మతః పాక్ దేశస్థురాలు కావ‌డంతో ఇప్పుడు ఆమెని ఫౌజీ సినిమా నుండి తీసేయాలంటూ డిమాండ్ మొదలైంది.

editor

Related Articles