28 మంది అమాయకులను బలిగొన్న ఈ దాడి హృదయ విదారకరమైనది. క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా–చిరంజీవి
‘ఇది చీకటి రోజు. పహల్గాం ఘటన కలచివేస్తోంది. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి మనందరికీ లభిస్తుందని ఆశిస్తున్నా. ఈ విషాదం నుండి మృతుల కుటుంబాలు బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’–మహేష్‌బాబు
బాధితులను తలచుకుంటే నా హృదయం బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని, శాంతి కోసం ప్రార్థిస్తున్నా–జూ.ఎన్టీఆర్.
రెండేళ్ల క్రితం నా పుట్టిన రోజును పహల్గాంలో జరుపుకున్నా. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లా. నిన్న జరిగిన దాడి ఘటన తెలుసుకుని నా హృదయం వికలమైంది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. భారతదేశం ఉగ్రవాదానికి ఎన్నటికీ తలవంచదు. ఇలాంటి పిరికివాళ్లను త్వరలో అంతమొందిస్తారని ఆశిస్తున్నా–విజయ్ దేవరకొండ.

