ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరై, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. పార్టీవర్గాల ప్రకారం, సోమవారం రాత్రి నుండి జ్వరం మరింతగా పెరగడంతో డాక్టర్లు ఆయనను పరీక్షించారు. అవసరమైన చికిత్స అందిస్తూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంట్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆయన శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో జరిగిన ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభిమానులను నిరాశపరచకుండా వానలో తడుస్తూనే ఆయన స్టేడియంలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్‌తో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అనంతరం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వర్షంలో తడవటం, బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్ సోకినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- September 24, 2025
0
70
Less than a minute
You can share this post!
editor