యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్‌గా కన్నా కూడా సమాజంపై ఎక్కువగా బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ గురించి తరచు ప్రస్తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం రష్మీ తన సోషల్ మీడియా పేజ్‌లో భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తూ.. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొంది. ఇక తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం అంటూ రష్మీ తన పోస్ట్‌లో పేర్కొంది. సెన్సిటివ్ విషయాల గురించి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానిని మనం అర్ధం చేసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించకుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ రష్మీ పేర్కొంది. ఈ సారి తన బర్త్ డేని బాలీలో జరుపుకుంది. వీల్ చైర్‌లో కూర్చొనే అందమైన ప్రదేశాలని చూస్తూ ఎంజాయ్ చేసింది రష్మి.
- May 15, 2025
0
132
Less than a minute
Tags:
You can share this post!
editor

