‘సప్తసాగరాలు దాటి’ వంటి హృద్యమైన ప్రేమకథా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు హేమంత్ రావు. ఆయన రూపొందిస్తున్న తాజా సినిమా ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. డాలీ ధనుంజయ, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులు. జె. ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ నిర్మిస్తున్నారు. శుక్రవారం డాలీ ధనుంజయ్ న్యూ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన డాలీ ధనుంజయ్.. ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ సినిమాని ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
- July 5, 2025
0
232
Less than a minute
Tags:
You can share this post!
administrator

