రఘు రామ్, శృతి శెట్టి, నైనా పాఠక్ ప్రధానపాత్రదారులుగా జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఓహ్!’. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకొని . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న విడుదలకు సిద్దమైనది. ఈ సందర్బంగా.. చిత్ర సమర్పకురాలు బి ఆర్ ఆర్ గ్రూప్స్ అధినేత్రి జీవిత బడుగు మాట్లాడుతూ.. మేము మా బిజినెస్ లో కస్టమర్స్ కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఓహ్ మూవీని కూడా అంతే క్వాలిటీ తో ప్రేక్షకులకు అందిస్తున్నామని అన్నారు. దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ..ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్ లో, క్రోమో ఫోబియా ని పాయింట్ గా తీసుకొని ఈ చిత్రం రూపొందించాం. కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి షూట్ చేసాం అని తెలిపారు. హీరో రఘురామ్ మాట్లాడుతూ.. ‘ఓహ్’ మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రానటువంటి అందమైన ప్రేమ కావ్యంతో ఈ చిత్రం వస్తుంది.
- December 9, 2025
0
13
Less than a minute
You can share this post!
editor


