పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమాయే “ఓజి”. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో అని ఇప్పటి నుండే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాకి కూడా ముందురోజే తెలుగు స్టేట్స్ లో Paid ప్రీమియర్స్ ఉంటాయని ఇదివరకే టాక్ వచ్చింది. తెలంగాణలో కొంచెం కష్టమే అయినా ఏపీలో మాత్రం డెఫినిట్ గా ముందే షోస్ పడిపోతాయని ఇపుడు వినిపిస్తోంది. రిలీజ్ ముందు రోజు అంటే సెప్టెంబర్ 24 రాత్రి 9 లేదా 9 గంటల 30 నిమిషాలకే షోస్ పడిపోయే ఛాన్స్ లు ఉన్నట్టుగా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. మరి దీనిపై మరింత క్లారిటీ నిర్మాతల నుండి రావాల్సి ఉంది.. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
- September 13, 2025
0
124
Less than a minute
You can share this post!
editor


