సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓజి స్టిల్స్!

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓజి స్టిల్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన సినిమాయే “ఓజి”. ఈ సినిమా పట్ల ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. 2024 సెప్టెంబర్ గత ఏడాది నుండి వాయిదా పడ్డప్పటికీ అంచనాలు పెరిగాయే తప్ప తగ్గింది లేదు. ఇలా ఓజి సినిమా కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రెండు క్రేజీ స్టిల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ షేక్ చేస్తున్నాయి. గ్లింప్స్ లో చూపించిన ఔట్ ఫిట్స్ లో పవన్ లుక్స్ అదిరిపోయాయి. దీనితో ఇవి నిజమైనవా లేక ఎ ఐ మాయాజాలమా అని అనుకున్న వారు కూడా లేకపోలేరు. ఏది ఏమైనప్పటికీ ఓజి నుండి మాత్రం భారీ ఫీస్ట్ గ్యారెంటీ అనేలా ఉంది పరిస్థితి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles