రాజమౌళి ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ ఒడిశా హిల్స్‌పై జరిగిన విషయం తెలిసిందే. అక్కడ షూటింగ్ జరపడానికి బలమైన కారణమే ఉందట. తాజా సమాచారం ప్రకారం ఒడిశా నేపథ్యం ఈ కథలో కీలకమట. అందుకే.. అక్కడ పేరెన్నికగన్న ‘మయూర్ భంజ్ ఛౌ’ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రియాంక చోప్రాకి ఆర్డర్ పాస్ చేశారట రాజమౌళి. దాంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు. మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం. ఈ నృత్యం కథలో కీలకంగా ఉంటుందట. ప్రియాంకకు నృత్యం నేర్పిన భర్తయా రీసెంట్‌గా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ప్రియాంకకు నృత్యం నేర్పడం గొప్ప అనుభవం. నృత్యాన్ని అభ్యసించడంలో ఆమె చూపించిన ఆసక్తి నిజంగా స్పూర్తిదాయకం. పెద్ద హీరోయిన్‌ని అన్న భావన తనలో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో నేనూ భాగం అయినందుకు సంతోషిస్తున్నా’ అని తెలిపారు.
- June 30, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor

