హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. ఆయన బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న భారీ చిత్రం ‘వార్ 2’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. టీజర్లో హృతిక్ రోషన్తో ఆయన తలపడే సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. కైరా అద్వానీ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ‘వార్’ సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో యాక్షన్ సన్నివేశాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘వార్ 2’తో బాలీవుడ్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- May 20, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

