ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్.!

ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్.!

కేజీఎఫ్, స‌లార్ సినిమాల ఫేమ్ క‌న్నడ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా ప్ర‌శాంత్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్. మీ విజన్ మాటల కంటే గొప్పది. తెరపై మరింత ఫైర్‌ని చూడాలని ఆశిస్తున్నాను అని తార‌క్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ అంటూ రాబోతున్న ఈ సినిమాకి డ్రాగ‌న్ అనే టైటిల్‌ని అనుకుంటున్న‌ట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ గత సినిమాలు ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ భారీ విజయాలు సాధించడంతో డ్రాగ‌న్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

editor

Related Articles